Saturday, December 22, 2012

పొట్టతగ్గాలా..డైట్ మార్చండి

మనం తీసు కొనే వివిధ రకాలైనటువంటి సమతుల్య ఆహారం అందరికీ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అంది స్తుంది. అయితే కొన్నిసార్లు మనం తీసుకొనే ఆరోగ్య కరమైన ఆహారాలు లింగ భేదం (ఆడ,మగ)పై ఆధార పడి ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలు మహిళ లకు, పురుషులకు అని  తేడా లేకుండా తింటుంటారు.

Friday, December 21, 2012

‘సారొచ్చారు’ రివ్యూ

నటీనటులు- రవితేజ, కాజల్, రిచా గంగోపాధ్యాయ, నారా రోహిత్, జయసుధ, చంద్రమోహన్, శ్రీనివాసరెడ్డి, ఎమ్మెస్ నారాయణ తదితరులు
సంగీతం- దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత- అశ్వనీదత్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం- పరశురాం
దర్శకుడు ఏదైనా రాసుకోవచ్చు.. ఏదైనా తీసుకోవచ్చు.. కానీ ప్రేక్షకుణ్ని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు.. అతణ్ని వెర్రివాణ్ని చేయాలని చూడకూడదు..

నాయకుడు జనం నుండి పుట్టుకు వొస్తాడు ..జనం కోసం పరితపిస్తాడు ..జనం కోసం జీవిస్తాడు ..


జగన్ కపటం లేని ఓ చల్లని చిరునవ్వుకు చిరునామా..మహానేత కలలు కన్న పేదవాడు రాజుగా పిలవబడే ఓ నూతన ప్రపంచానికి వారధిగా నిలవాలని తలచిన యోధుడు ........................
నాయకుడు జనం నుండి పుట్టుకు వొస్తాడు ..జనం కోసం పరితపిస్తాడు ..జనం కోసం జీవిస్తాడు ..ఆ జనానికి ఇచ్చినమాట కోసం ఎన్ని కష్టాలయినా చిరునవ్వుతో భరిస్తాడు ..అతనే నిజమైన ప్రజానాయకుడు అలాంటినాయకుడే జగన్..................

బాద్ షా ఏమయ్యాడో !?

ఒకవైపు ఈ మధ్య సినీ వార్తలన్నీ మెగాస్టార్ ఫ్యామిలీ గురించి, సీతమ్మ వాకిట్లోసిరిమల్లెచెట్టు గురించి, ఇతర వివాదాల గురించినే నిండిపోతున్నాయి. నందమూరి యంగ్ టైగర్ బాద్ షా గురించి వార్తల హడావుడి కొంచెం తగ్గింది. జూనియర్ కు కెరీర్ లో అది పెద్ద హిట్ గా నిలుస్తుందంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని సమాచారం. ప్రత్యేకించి శ్రీనువైట్ల ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో నవదీప్ పాలు పంచుకుంటున్నాడు. దీంట్లో ఈ యంగ్ హీరో నెగిటివ్ రోల్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నవదీప్ పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంటుందంటున్నారు. కింగ్ వంటి సినిమాలో దీపక్ ను విలన్ గా చూపే ప్రయత్నం చేసిన శ్రీను ఈ సారి నవదీప్ కు ఆ అవకాశం ఇచ్చాడు. హైదరాబాద్ షెడ్యూల్ లో భాగంగా నవదీప్ తో సీన్లు తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎమ్ ఎస్ నారాయణ, బ్రహ్మానందంల కామెడీ హైలెట్ అని టాక్. గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా పై నందమూరి ఫ్యాన్స్ చాలా ఆశలతో ఉన్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్, థమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు. మరి ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎటువంటి అనుభూతిని మిగులుస్తుందో!

వీళ్లకు సినిమా పేర్లు దొరకడం లేదా?

తెలుగులో అరుదుగా కనిపించే మహిళా దర్శకురాల్లో నందినీ రెడ్డి ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. తొలిసినిమాతో సంచలనాత్మక విజయాన్ని సాధించడమే ఈమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. తాజాగా సిద్ధార్థ్, నిత్యామీనన్, సమంతలతో నందిని ‘డుం డుం పీ పీ’ అనిపించనుంది. బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తిని రేపుతోంది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘అలా మొదలైంది’ చాలా కూల్ గా హిట్ కొట్టేయగా, ‘డుం డుం పీ పీ’ అంత కన్నా కూల్ గా రెడీ అవుతోంది. అంతే కాదు ఈ సినిమా తమిళంలోకి కూడా డబ్బింగ్ కానుంది.

వేర్వేరు పెళ్లిళ్లు: అయినా అఫైర్, ప్రేమికుల ఆత్మహత్య

వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్న ప్రేమికులు ఆ తర్వాత కలుసుకుని సంబంధం పెట్టుకుని ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు ఈ సంఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి - అమె పేరు శివమ్మ(26), అతని పేరు రవి (27). ఇద్దరికీ నాలుగేళ్ల క్రితం వేర్వేరు వ్యక్తులతో వివాహమయింది. రవి భార్య కాన్పు సమయంలో చనిపోయింది. ఈ నేపథ్యంలో శివమ్మకు, రవితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి శివమ్మను భర్త సుబ్బరాయుడు గట్టిగా మందలించాడు.